Published on Sep 13, 2026 6:04 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఐమ్యాక్స్ వెర్షన్ లో తెరకెక్కిస్తూ పూర్తిగా హాలీవుడ్ మార్కెట్ పైనే కన్నేశారు.
అయితే ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి ఇటీవల ఓ అప్డేట్ అందించాము. ఇక దీనికి అనుగుణంగా లేటెస్ట్ గా నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఎస్ కార్తికేయ కూడా ఓ క్లారిటీ ఇచ్చేసారు. వారణాసి షూటింగ్ దాదాపు పూర్తి చేసినట్టు తెలిపారు. అలాగే చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమా ఉండబోతుంది అని కూడా ఖాయం చేశారు.
దీనితో తన స్టేట్మెంట్ తో ఫ్యాన్స్ లో ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఇదే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సాలిడ్ క్వాలిటీ అలాగే స్పీడ్ తో కూడా ముగిస్తున్నట్టు తెలుస్తుంది. సో అనుకున్న సమయానికే వారణాసి రావడం జరుగుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు.


