Published on Sep 14, 2026 1:01 PM IST
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “విశ్వంభర”. ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఐతే, ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎట్టకేలకు ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ఓటీటీ డీల్ ఫైనల్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుందని వార్తలు వస్తుండగా, చిత్ర బృందం ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐతే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


