‘మోహన్ బాబు’ పాత్రతో ప్రధాన కనెక్షన్ అదే !

‘మోహన్ బాబు’ పాత్రతో ప్రధాన కనెక్షన్ అదే !

Published on Sep 21, 2026 2:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో రాబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. ఐతే, ప్యారడైజ్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఫైట్లు, పాటల కంటే ఆ ‘అమ్మ–కొడుకు’ ఎమోషనే మిమ్మల్ని వెంటాడుతుంది అంటూ నాని చెప్పిన సంగతి తెలిసిందే. నాని పోషిస్తున్న జడలు పాత్ర తన తల్లి సమ్మక్కతో ఉన్న బంధం, ఆమె కోసం చేసే పోరాటం కథకు ప్రధాన ఎమోషనల్ బేస్‌గా ఉంటుందట.

అందుకే నాని–మోహన్ బాబు మధ్య వచ్చే ఘర్షణ కేవలం యాక్షన్‌ కే పరిమితం కాకుండా, తల్లి–కొడుకు బంధానికి సంబంధించిన బలమైన భావోద్వేగాలతో కూడిన డ్రామాగా సాగుతుందట. పైగా సినిమాలో మోహన్ బాబు పాత్ర.. నాని పాత్రకు అనాధికారికంగా తండ్రి పాత్ర అని.. కానీ, దాన్ని మోహన్ బాబు పాత్ర అంగీకరించదు అని తెలుస్తోంది.

కాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, మరియు సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ఈ పాన్-ఇండియా చిత్రం రూపొందుతోంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *