ఓటీటీలో ఇరుముడి ర్యాంపేజ్ కంటిన్యూ.. ఆ క్యాటగిరీలో టాప్ ప్లేస్..!

ఓటీటీలో ఇరుముడి ర్యాంపేజ్ కంటిన్యూ.. ఆ క్యాటగిరీలో టాప్ ప్లేస్..!

Published on Sep 30, 2026 4:00 PM IST

irumudi

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం దుమ్మురేపుతోంది. గ్లోబల్ టాప్-10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ఈ చిత్రం టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఈ ఒక్క వీకెండ్‌లోనే ఏకంగా 3.4 మిలియన్ల వ్యూస్ సాధించి, ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

సెప్టెంబర్ 18న స్ట్రీమింగ్‌‌కు వచ్చిన ఈ చిత్రం, తొలి మూడు రోజుల్లోనే 3.4 మిలియన్ల వ్యూస్ సాధించగా, ఇప్పటివరకు మొత్తంగా 6.8 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు చేయడం విశేషం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించగా, సాయి కుమార్ కీలక పాత్రలో మెరిశారు. కూతురు, కుటుంబం కోసం ఓ తండ్రి చేసే డివోషనల్ ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ చిత్రం థియేటర్లలో ఘనవిజయం సాధించడమే కాకుండా, ఓటీటీలోనూ అదే హవా కొనసాగిస్తోంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ‘ఇరుముడి’, నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో నిలిచి తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *