ది ప్యారడైజ్ రిలీజ్ కన్ఫ్యూజన్: వారిలా.. వీరిలా.. కానీ ఫైనల్ ఇదేనట

ది ప్యారడైజ్ రిలీజ్ కన్ఫ్యూజన్: వారిలా.. వీరిలా.. కానీ ఫైనల్ ఇదేనట

Published on Sep 7, 2026 12:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. తెలుగు సినిమా నుంచి నెక్స్ట్ బిగ్ థింగ్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా భారీ దీనిపై సెట్ అయ్యింది. అయితే ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా అలా వాయిదా పడుతూ రావడం పైగా ఇప్పుడు రిలీజ్ కూడా మళ్లీ అనుమానమే అంటూ వస్తున్న పుకార్లు ఫ్యాన్స్ ని చాలా కన్ఫ్యూజన్ లోకి నెట్టేసాయి.

ఒక పక్క సినీ వర్గాల్లో వాయిదా కన్ఫర్మ్ అని అంటుంటే ఓవర్సీస్ వర్గాలు మాత్రం వాయిదా ఏమి లేదని నొక్కి చెబుతున్నారు. కానీ ఫైనల్ గా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్ వాయిదా వార్తల్లో ఎలాంటి నిజం లేదట. పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే ఈ సినిమా రావడం పక్కా అట. సో మొత్తానికి ప్యారడైజ్ విషయంలో నడుస్తున్న హడావుడి పట్ల క్లారిటీ ఇదనమాట. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *