Published on Sep 14, 2026 9:02 AM IST
న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో రాబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సెప్టెంబర్ 24న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తాజా ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ సినిమా పై బజ్ బలంగా ఉంది. పైగా ‘దసరా’ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు, అటు నాని రగ్గడ్ లుక్, టీజర్లో కనిపించిన డార్క్ యాక్షన్ టోన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ ఆసక్తిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షేర్ నాని కెరీర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబోతున్నాయని అంచనా ఉంది.
ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తొలి వీకెండ్లో ఆ నంబర్లు మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. అన్నట్టు ‘ప్యారడైజ్’ సినిమాలో నాని క్యారెక్టర్, డైలాగులు చాలా బోల్డ్‌గా, ఊరమాస్‌గా ఉండబోతున్నాయట. ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్ మరియు సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ఈ పాన్-ఇండియా చిత్రం రూపొందుతోంది.


