నాని ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్: నైజాంలో టికెట్ల జోరు.. గంటలోనే రికార్డు స్థాయి అమ్మకాలు

నాని ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్: నైజాంలో టికెట్ల జోరు.. గంటలోనే రికార్డు స్థాయి అమ్మకాలు

Published on Sep 21, 2026 11:00 AM IST

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రస్తుతానికి నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ కాగా, టికెట్ విండోస్ వద్ద ప్రేక్షకులు భారీగా పోటీ పడుతున్నారు.

సికింద్రాబాద్‌లోని ఓ స్లమ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే భారీ హైప్ ఉంది. తాజాగా మొదలైన బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఆ అంచనాలు నిజమవుతున్నాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి గంట వ్యవధిలోనే దాదాపు 11 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఇందులో బుక్‌మైషోలోనే గంటకు 6.59 వేల టికెట్లు బుక్ అయ్యాయి.

ఇప్పటివరకు ఒక్క బుక్‌మైషోలోనే 3.28 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించారు. కేవలం నైజాం బుకింగ్స్‌కే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం విశేషం. మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయి బుకింగ్స్ మొదలైతే వసూళ్ల జోరు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *