GV Prakash Kumar’s Immortal Movie Review In Telugu

GV Prakash Kumar’s Immortal Movie Review In Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 19, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : జీవీ ప్రకాశ్‌ కుమార్‌, కయాదు లోహర్‌, టీఎమ్‌ కార్తిక్‌, కుమార్‌ నటరాజన్‌, ఆదిత్య కథిర్‌ తదితరులు
దర్శకత్వం : మారియప్పన్‌ చిన్న
నిర్మాత : అరుణ్‌కుమార్ ధనశేఖరన్
సంగీతం : శ్యామ్‌ సీఎస్‌
ఛాయాగ్రహణం : అరుణ్ రాధాకృష్ణన్
కూర్పు : రాజేష్ మహాలక్ష్మి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇమ్మోర్టల్‌’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :-

మహి (జీవీ ప్రకాశ్‌కుమార్‌) తన మామయ్య ప్రింటింగ్‌ ప్రెస్‌లో డిజైనర్‌గా వర్క్ చేస్తుంటాడు. ఐతే, తన అద్దె ఇంటి యజమాని పెట్టే పోరు భరించలేక వేరే రూమ్ కి మారాలని నిర్ణయించుకుంటాడు. తన జీతానికి తగిన ఇల్లు కోసం తిరుగుతూ ఉన్న సమయంలో.. అతనికి సింధు (కయాదు లోహర్‌) నుంచి కాల్ వస్తోంది. షేరింగ్‌ ఫ్లాట్‌ గురించి చెబుతుంది. మహి కూడా ఉత్సాహంగా ఆమె ఫ్లాట్‌కు వెళ్తాడు. అక్కడ సింధుని చూసిన తొలి చూపులోనే మహి ఆమెతో ప్రేమలో పడతాడు. సింధు కూడా అతనితో కలివిడిగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. సింధు గురించి మహికి ఓ రహస్యం తెలుస్తుంది. అసలు సింధు ఎవరు ?, ఆమె గురించి తెలిశాక మహి భయంతో ఎందుకు వణికిపోతాడు ?, ఆమె నుంచి, ఆమె అపార్ట్‌మెంట్‌ నుంచి మహి పారిపోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ?, ఇంతకీ.. సింధు గురించి మహికి తెలిసిన నిజం ఏంటి ?, ఈ కథకు వెయ్యేళ్ల కిందట ఆటవిక జాతిలో పుట్టిన మృగానికీ ఉన్న కనెక్షన్ ఏంటి ?, మొత్తానికి మహి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ హారర్‌ కథలో వేయి ఏళ్ల నటి వింత మృగం, ఆ మృగానికి సంబంధించిన ఫాంటసీ ఎలిమెంట్స్‌.. వీటి మధ్యలో ఓ సగటు కుర్రాడైన మహి పాత్ర, అతని ఆశ, అమాయకత్వం.. నిజం తెలిశాక ప్రాణాలు కాపాడుకోవడానికి అతను ప్రయత్నించే దారులు.. మొత్తానికి ఈ ఇమ్మోర్టల్‌ చిత్రంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన సింధు పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన మృగం ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మహి పాత్ర.. ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. హీరోయిన్ కయాదు లోహర్‌ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన టీఎమ్‌ కార్తిక్‌ కూడా బాగానే నటించారు.

ఇక కుమార్‌ నటరాజన్‌, ఆదిత్య కథిర్‌ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సింధు ట్రాప్‌లో మహి పడటం, ఆమె అందానికి అతడు ముగ్దుడు కావడం వంటి రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

కథలో ఎంత కల్పన అయినా ఉండొచ్చు. కానీ, కథే పూర్తి కల్పన అయితే, ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలు ఉండాలి, నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ, దర్శకుడు మారియప్పన్‌ తీసిన ఈ ‘ఇమ్మోర్టల్‌’ సినిమాలో అది మిస్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర క్రియేట్ చేసిన మాయ ప్రపంచం.. పూర్తిగా ఇల్లాజికల్ గా సాగుతుంది. అయినా, దెయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు.

దీనికి తోడు, ‘ఇమ్మోర్టల్‌’లోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి. అయితే, దర్శకుడు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాలో చాలా చోట్ల లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా మిస్ కావడం, మరియు బోరింగ్ ప్లే ఎక్కువ అవ్వడం వంటి అంశాల కారణంగా ఈ సినిమా బాగాలేదు. మొత్తమ్మీద ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న వింత మృగం, దాని మాయలోకం బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌ సమకూర్చిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘ఇమ్మోర్టల్‌’ అంటూ వచ్చిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ – కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే, విజువల్స్ మరియు నటీనటుల నటన కూడా బాగుంది. ఐతే, కథనం స్లోగా రెగ్యులర్ గా సాగడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *