టీజర్ టాక్: ‘మైసా’తో రష్మిక ఉగ్రరూపం!

టీజర్ టాక్: ‘మైసా’తో రష్మిక ఉగ్రరూపం!

Published on Sep 20, 2026 7:42 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గానే కాకుండా తనపై సోలో సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా యువ దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘మైసా’ చేస్తుంది. ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా విడుదల చేసిన టీజర్ లో మాత్రం రష్మిక తన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ తో మరో కోణాన్ని చూపించింది అని చెప్పవచ్చు.

ఒక తెరచాటు ఆడపిల్ల వైలెంట్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ అంతటినీ రష్మిక తన ఉగ్రరూపంతో చూపించింది అని చెప్పాలి. రష్మిక సాలిడ్ పెర్ఫామార్ అని అందరికీ తెలుసు. కానీ ఇందులో ఆమె చేస్తున్న యాక్షన్ పార్ట్ కూడా ఒకింత షాకింగ్ గా ఉందని చెప్పాలి. తన డెడికేషన్ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ టీజర్ అంతా ఆమెనే హైలైట్ గా కనిపిస్తుంది.

ఇక జేక్స్ బిజోయ్ ఇచ్చిన స్కోర్ కూడా బాగుంది. దర్శకుడు రవీంద్ర ఒక రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ ఫీస్ట్ ని ప్రామిస్ చేస్తున్నారు. సహజమైన లొకేషన్స్ లో షూట్ చేసినట్టుగా ఇందులో కనిపిస్తుంది. దీనిలో కెమెరా వర్క్ ఇతర బృందాలు కూడా గట్టిగానే కష్టపడినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ నవంబర్ 27న ఒక ఇంటెన్స్ ఫీస్ట్ ని అన్ ఫార్ములా ఫిలిమ్స్ వారు తీసుకొస్తున్నారని చెప్పొచ్చు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *