‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్ పై సర్ప్రైజింగ్ డీటైల్స్ రివీల్ చేసిన రాజమౌళి!

‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్ పై సర్ప్రైజింగ్ డీటైల్స్ రివీల్ చేసిన రాజమౌళి!

Published on Sep 15, 2026 11:00 AM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి టాలెంటెడ్ నటుల కలయికలో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సై ఫై వండర్ సినిమానే వారణాసి.

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ఎప్పటికప్పుడు హాలీవుడ్ మీడియాలో నానేలా ఇంటర్వ్యూస్, పాడ్ కాస్ట్ లు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక 25 నిమిషాల పాటుగా సాగే రామాయణ ఎపిసోడ్ కూడా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కానీ ఈ రామాయణ ఎపిసోడ్ పై సర్ప్రైజింగ్ డీటెయిల్స్ రాజమౌళి రివీల్ చేయడం జరిగింది.

సినిమాలో రామాయణ యుద్ధం పోర్షన్ పూర్తిగా ఒకేసారి ఉండదని షాకిచ్చారు. ఆ ఎపిసోడ్ మళ్లీ సబ్ ఎపిసోడ్స్ గా ఉంటుంది అని తెలిపారు. కథనం పరంగా సందర్భానుసారం రామాయణ ఎపిసోడ్స్ కనిపిస్తాయి అని అసలు విషయం తెలిపారు. దీనితో వారణాసి సినిమా ఎలా ఉండబోతోంది అనే ఉత్సుకత అభిమానుల్లో ఇతర ఆడియెన్స్ లో కూడా మరింత ఎక్కువ అయ్యింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *